విగ్రహాలను ధ్వసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

GDWL: గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని పారిచర్ల స్టేజ్ సమీపంలోని సవరమ్మ తల్లి కమాన్‌లో ఉన్న పోతరాజుల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు మంగళవారం వెల్లడించారు. ఈ ఘటనపై ఐక్య హిందుత్వ సంఘం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో శాంతి భద్రతలను పాడుచేయాలని ప్రయత్నిస్తున్న వారి పై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవలన్నారు.