VIDEO: మొక్కులు చెల్లించిన ఇల్లందు ఎమ్మెల్యే
MLG: ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి మేడారం వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క–సారలమ్మలకు చీర, సారె, పసుపు–కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తులాభారం వేసి మొక్కులు చెల్లించగా, ప్రజల ఆయురారోగ్యాలు, రాష్ట్ర సుభిక్షత కోసం అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు.