అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం

అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం

AKP: నాతవరం మండలం డీ.ఎర్రవరం సచివాలయ పరిధిలోని వెంకయ్యపాలెం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగజ్యోతి మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే పిల్లలకు ఆటలు, పాటల ద్వారా శారీరకంగా, మానసికంగా మంచి అభివృద్ధి కలుగుతుందని అన్నారు. సమతుల్య ఆహారం, శుభ్రత, ఆటల ప్రాముఖ్యతను వివరించారు.