ఈదలం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా 'నేమాల'

ఈదలం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా 'నేమాల'

AKP: పాయకరావుపేట మండలం ఈదటం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా నేమాల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో శనివారం పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు. గ్రామస్థాయి నాయకులు అందరూ 'నేమాల'ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే మిగిలిన కమిటీ సభ్యులకు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొన్నారు.