బైక్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
NZB: రోడ్డుపై వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం దగ్ధమైన ఘటన నేడు NZBలో జరిగింది. మాణిక్ బండారుకు చెందిన గోవర్ధన్ మరో వ్యక్తితో కలిసి NZB నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా పల్సర్ వాహనం బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. ఇద్దరూ బైక్ నుంచి దూకేయగా బంక్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.