వృథా అవుతున్న చెరువు నీరు...
WGL: వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డి చెరువులోకి ఇటీవల కురిసిన వర్షానికి నీరు చేరింది. అయితే వచ్చిన నీరు వచ్చినట్లుగానే నక్కతూము నుంచి బయటకు వృథాగా పోతున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని శనివారం పట్టణ ప్రజలు తెలిపారు. అధికారులు స్పందించి తూము నుంచి నీరు బయటకు వెల్లంకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.