జగన్ జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి
AP: అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి సత్యకుమార్ అన్నారు. ' ఆరేళ్ల తర్వాత తప్పని పరిస్థితుల్లో కోర్టు విచారణకు జగన్ హాజరయ్యారు. హైదరాబాద్‌లో ముందస్తు ప్రణాళికతోనే పెయిడ్ ఆర్టిస్టులతో ర్యాలీ. బల ప్రదర్శనకు దిగడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం. కోర్టు కేసుల నుంచి తప్పించుకుని జగన్ ఎంతోకాలం బయట తిరగలేరు' అని పేర్కొన్నారు.