లింగంపల్లి గ్రామపంచాయతీలో తొలిసారి ఎన్నికలు
MDK: కౌడిపల్లి మండలంలో లింగంపల్లి గ్రామపంచాయతీ నూతనంగా ఏర్పడింది. ఈ స్థానానికి ఎస్టీ మహిళలకు కేటాయించారు. లింగంపల్లిలో మొత్తం 542 మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో పురుషులు 262 మంది, స్త్రీలు 280 మంది ఓటర్లు ఉన్నారు. మూడో విడతలో 542 మంది ఓటర్లు డిసెంబర్ 17 తేదిన తమ తొలి, నూతన, సర్పంచ్‌ను ఎన్నుకోబోతున్నారు.