'క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం'

'క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం'

NZB: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ACP వెంకటేశ్వర్​రెడ్డి శనివారం పేర్కొన్నారు. మెండోరా పోలీసుల ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోచంపాడు గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నీలో అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొనడం అభినందనీయమన్నారు. మత్తు పదార్థాల వలన కలిగే దుష్ప్రభావాలను ఆయన వివరించారు.