రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

MDK: మెదక్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంటకు చెందిన కృష్ణ మృతి చెందాడు. మెదక్‌లో BRS పార్టీ కార్యాలయం వద్ద నడుచుకుంటూ వెళుతున్న కృష్ణను ద్విచక్ర వాహనదారు ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలోనే కృష్ణ మృతి చెందాడు. ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.