గట్టుప్పల్‌లో గావ్ చలో బస్తీ చలో

NLG: గట్టుప్పల్ మండలం శేరిగూడెంలో బీజేపీ మండల అధ్యక్షుడు రావుల ఎల్లప్ప ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్తులకు వివరిస్తున్నామని ఎల్లప్ప తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల్లో బీజేపీ అన్ని గ్రామాల్లో పోటీ చేస్తుందన్నారు.