VIDEO: నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ సందర్శించిన కవిత
KMR: తెలంగాణ జాగృతి చీఫ్ కవిత గురువారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యంగా నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులతో ఆమె నేరుగా మాట్లాడారు.