ఉత్తమ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ పోటీల దరఖాస్తుకు నేడే లాస్ట్
HYD: రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించేలా ఫోటోలు, వీడియోలు తీసిన వారికి నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీనికోసం tourism.telangana.gov.in వెబ్‌సైట్‌ని సంప్రదించాలన్నారు.