ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ ఇన్‌ఛార్జ్
సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని జామియా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ధర్మవరం టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు అస్లాం నడిమ్ మసీద్, షామీర్ నడిమ్ మసీద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విందులో పట్టణంలోని ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.