118 దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్

118 దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాని కార్యక్రమంలో 118 ఫిర్యాదులను ప్రజల నుంచి కలెక్టర్ స్నేహ శబరిష్ స్వీకరించారు. వీటిలో అత్యధిక శాతం పింఛన్లు, సదరం క్యాంప్‌కు సంబంధించిన సమస్యలతో పాటు వ్యక్తిగత ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.