పర్యాటకులపై ఉగ్రదాడి హేయమైన చర్య: మాజీ మంత్రి

పర్యాటకులపై ఉగ్రదాడి హేయమైన చర్య: మాజీ మంత్రి

కాశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి జరగడం హేయమైన చర్యగా జనసేన పార్టీ పీఎసీ సభ్యురాలు మాజీ మంత్రి పడాల అరుణ అభివర్ణించారు. ఆమె బుధవారం తన స్వగృహంలో మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు మూడు రోజులు కార్యక్రమాలు చేపడతామన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు, పార్టీ నేతలు లక్ష్మనాయుడు పాల్గొన్నారు.