ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

ఎన్టీఆర్: విజయవాడలోని కనక దుర్గమ్మ దేవస్థానంలో ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. క్యూ లైన్లలో చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు సిబ్బంది పంపిణీ చేశారు.