యూరియాపై గందరగోళం సృష్టిస్తున్నారు: MLA

SKLM: యూరియాపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఎకరాకు మొదటి విడతగా 25 కేజీలు, రెండో విడతగా 25 కేజీలు, మూడో విడతగా 25 కేజీ మొత్తం 75 కేజీలు అందజేస్తామన్నారు.