చెట్టు నరికివేతపై విచారణకు ఆదేశం

చెట్టు నరికివేతపై విచారణకు ఆదేశం

NRPT: మక్తల్‌లోని కర్నేరోడ్డులో అనుమతులు లేకుండా ఓ పెద్ద చెట్టును పూర్తిగా నరికివేశారు. చెట్టుతో ఇబ్బంది ఉన్నా, కొమ్మలు మాత్రమే కొట్టాలని నిబంధనలు చెబుతున్నా, కొందరు పట్టించుకోలేదు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా, చెట్టు నరికివేతకు ఎటువంటి అనుమతి లేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.