VIDEO: జాతర ఏర్పాట్లపై డీసీపీ దార కవిత సమీక్ష
HNK: కాజీపేట మండలం అమ్మవారిపేట గ్రామంలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న శ్రీ మేడారం జాతర ఏర్పాట్లపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత సోమవారం సమీక్ష నిర్వహించారు. భక్తుల భద్రతకు పటిష్ట బందోబస్త్, క్యూలైన్ల ఏర్పాటు చేసి జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.