కడప-చెన్నై హైవేలో అడుగుకోగుంత
KDP: సిద్దవటం మండలంలోని కడప- చెన్నై జాతీయ రహదారి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు గుంతల మయమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులు చేయించాలని వాహదారులు, ప్రజలు కోరుతున్నారు.