'ఆత్మవిశ్వాసం నింపేందుకు 'బుధవారం బోధన''

'ఆత్మవిశ్వాసం నింపేందుకు 'బుధవారం బోధన''

KNR: ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం బోధన కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కఠినమైన అంశాలు, పాఠాలు నేర్పించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కొత్తపల్లి మండలం ఎలగందుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'బుధవారం బోధన' కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. పదవ తరగతి విద్యార్థులు బోధనలో నేర్పిన విషయాలను పరిశీలించారు.