వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

కర్నూల్: ఆదోని పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో పండంటి మగబిడ్డ మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు బుధవారం ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. పట్టణంలోని బోయగేరికి చెందిన మహాలక్ష్మి ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. మంగళవారం రాత్రి సిజరింగ్ చేసిన వైద్యులు.. శిశువు మృతి చెందాడని కుటుంబసభ్యులకు తెలిపారు.