లంబాడ జేఏసీ నూతన అధ్యక్షుడి నియామకం

WGL: నర్సంపేట పట్టణ లంబాడ JAC నూతన కమిటీ అధ్యక్షుడిగా బానోత్ లక్ష్మణ్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లంబాడ JAC జిల్లా అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో లంబాడాల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో లంబాడ జేఏసీ నాయకులు శోభన్, శంకర్ నాయక్, గోపాల్ నాయక్ ఉన్నారు.