పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
PLD: క్రోసూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. తేమ శాతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, రైతుల నుంచి క్వింటాల్‌కు రూ. 8,110 మద్దతు ధరతో ప్రత్తి కొనుగోళ్లను నిర్వహించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.