వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్ది
MHBD: తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మనబోయిన రాజేందర్ యాదవ్ కుమారుడి వివాహ మహోత్సవానికి ఆదివారం పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్ది హాజరై, నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివాహం అనేది జీవితంలో అత్యంత పవిత్రమైన బంధమని గుర్తు చేశారు.