నిజాయితీని చాటుకున్న తేజావత్ గాంధీ
BDK: బూర్గంపహాడ్ మండలంలో ప్రజాతంత్ర దినపత్రికలో పాత్రికేయుడుగా పనిచేస్తున్న తేజావత్ గాంధీ తన నిజాయితీని ఇవాళ చాటుకున్నారు.కొత్తగూడెం నుండి మణుగూరు వెళ్ళే బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో తనకు దొరికిన ఓ పాత్రికేయుడి కి చెందిన నగదు కలిగిన పర్సును బస్సు కండక్టర్‌కి అందజేశారు. పర్సులో 20వేల నగదుతో పాటు ముఖ్యమైన ఏటీఎం కార్డ్స్ సైతం ఉన్నాయి.