ప్రజల గుండెల్లో చెరగని ముద్ర గోపన్నది
HYD: జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర మాగంటి గోపీనాథ్ దీ అని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. ఈరోజు షేక్ పేట డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాగంటి గోపన్న మాదిరిగానే ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. ఉప ఎన్నికల్లో ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు.