రెసిడెన్షియల్ పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత

NZB: పోచంపాడు తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో 2004-05లో పదో తరగతి చెందిన పూర్వ విద్యార్థులు 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం పాఠశాలకు కానుకలు అందించినట్లు తెలిపారు. రూ.1.10 లక్షల విలువైన సౌండ్ సిస్టమ్, 500 లీటర్ల విలువైన ఫ్రిడ్జ్ అందించినట్లు చెప్పారు. పాఠశాల ఆవరణలో 20 మొక్కలను కూడా నాటినట్లు తెలిపారు.