'స్మార్ట్ మీటర్ల బిగింపు విరమించుకోవాలి'

ELR: స్మార్ట్ మీటర్స్ రద్దు చేయాలని, కరెంట్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జంగారెడ్డిగూడెంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా మహిళా సంఘం జిల్లా నాయకులు నాగమణి, శ్యామలరాణిలు మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తున్నారన్నారు. అలాగే స్మార్ట్ మీటర్లను బిగించడం విరమించుకోవాలన్నారు.