'ఇన్నాళ్లూ మీకోసమే పనిచేశా'.. సీఎం ఎమోషనల్ వీడియో
బీహార్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల ముందు సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. తన కుటుంబాన్ని కూడా పక్కనబెట్టి మరీ తాను ఇన్నాళ్లూ కేవలం ప్రజల కోసమే కష్టపడి పనిచేశానని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఈ సందేశాన్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది.