బిల్లులు పెండింగ్.. పంచాయతీ భవనానికి తాళం

బిల్లులు పెండింగ్.. పంచాయతీ భవనానికి తాళం

WGL: పర్వతగిరిలోని మాల్యతండా గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి సంబంధించి మూడేళ్లుగా బిల్లులు విడుదల కాకపోవడంతో శనివారం కాంట్రాక్టర్ కార్యాలయానికి తాళం వేశారు. అప్పటి సర్పంచ్ సుజాత భర్త ఈర్యానాయక్ భవనంతో పాటు ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకు సంబంధించి సుమారు రూ.38 లక్షల బిల్లులు రావాల్సి ఉండగా, అవి ఇంకా పెండింగ్‌లోనే ఉండడంతో నిరసనగా తాళం వేసినట్లు ఆయన తెలిపారు.