పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 16 మంది అరెస్ట్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 16 మంది అరెస్ట్

కర్నూలు: ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం మెరుపు దాడి చేశారు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలకు చెందిన విరూపాక్షి, రామకృష్ణతో పాటు మరో 16 మంది పేకాట ఆడుతుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 5.30 లక్షల నగదు, 17 సెల్‌ఫోన్లు, 8 బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.