పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మాజీ ఎమ్మెల్యే
JGL: జగిత్యాల ప్రభుత్వ మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 1969-70, 12వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొని, పూర్వ విద్యార్థులతో కలిసి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశలోని అనుభవాలు, స్నేహితులతో గడిపిన రోజులను పంచుకున్నారు.