కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
HNK: ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామంలో కోతుల మందలు భారీగా పెరిగిపోయాయి. మల్కపేట రోడ్డు పై వందల కొద్దీ కోతులు తిరుగుతుండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు కూడా కోతుల దాడికి బెంబేలెత్తుతున్నారు. పంటలను నాశనం చేస్తూ, గ్రామస్థులను వేధిస్తున్న కోతుల బెడద తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.