ఇరాన్ అణుకేంద్రంపై దాడి జరిగింది: IAEA
ఇరాన్‌లోని నటాన్జ్ అణుకేంద్రంపై దాడి జరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(IAEA) వెల్లడించింది. అణుకేంద్రం ప్రాంగణంలోని భవనాలు దెబ్బతిన్నాయని ప్రకటించింది. కానీ ఎలాంటి రేడియేషన్ లీకేజీ జరగలేదని స్పష్టం చేసింది. ఇరాన్ పొరుగు దేశాల్లో కూడా రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని మానిటరింగ్ నెట్‌వర్క్ తెలిపింది.