గిల్‌పై సాయి సుదర్శన్ ప్రశంసలు
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఆ జట్టు ప్లేయర్ సాయి సుదర్శన్ ప్రశంసలు కురిపించాడు. గిల్ జట్టులోని ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వారికి తగిన గుర్తింపునిస్తాడని పేర్కొన్నాడు. కెప్టెన్ ఇచ్చే భరోసా వల్లే తాము మైదానంలో స్వేచ్ఛగా ఆడగలుగుతున్నామని వెల్లడించాడు. గిల్ యొక్క ఆలోచనా విధానం, మైదానంలో అతని నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయని తెలిపాడు.