ఇల్లు లేని వారిని పారదర్శకంగా గుర్తించండి: మున్సిపల్ ఛైర్మన్

ఇల్లు లేని వారిని పారదర్శకంగా గుర్తించండి: మున్సిపల్ ఛైర్మన్

సత్యసాయి: హిందూపురం పట్టణంలోని ప్రతి వార్డులలో ఇల్లు లేని వారిని పారదర్శకంగా గుర్తించాలని హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శితో ఆయన సమావేశం నిర్వహించారు. ఇల్లు పట్టాలు పొందిన వారిని, ఇల్లులేని వారిని గుర్తించాలని తెలిపారు. ఇల్లు లేని వారికి త్వరలోనే ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారు.