VIDEO: తోట్లవల్లూరు పాఠశాలలో పాము కలకలం

కృష్ణా: తోట్లవల్లూరులోని జెడ్పీ పాఠశాలలో బుధవారం ఒక తాచుపాము విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసింది. 8వ తరగతి గదిలో దుర్వాసన రావడంతో ఒక విద్యార్థి పాత బల్లల కింద చనిపోయిన కప్పను బయటకు లాగాడు. అదే సమయంలో అక్కడ దాగి ఉన్న తాచుపాము పైకి లేచి బుసలు కొట్టడంతో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు అప్రమత్తమై పామును చంపారు.