అవార్డు అందుకున్న బొబ్బిలి కమిషనర్‌

అవార్డు అందుకున్న బొబ్బిలి కమిషనర్‌

VZM: ఉత్తమ కమిషనర్‌గా బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి అవార్డు తీసుకున్నారు. జిల్లాలో ఇవాళ జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలో ప్రజలకు అందిస్తున్నసేవలకు గుర్తింపుగా అవార్డు వచ్చింది. ప్రజలకు మరింత బాధ్యతగా సేవలు అందిస్తామని కమిషనర్ తెలిపారు.