బోయిన్‌పల్లిలో చైన్ స్నాచింగ్

బోయిన్‌పల్లిలో చైన్ స్నాచింగ్

HYD: బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికంఠ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. కిరాణా షాపు యజమాని నాగలక్ష్మి కూల్‌డ్రింక్  ఇచ్చి చిల్లర అందజేసే లోపే దుండగుడు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కెల్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.