అనాధ గోమాతకు అంత్యక్రియలు

కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఓ గోవు తుది శ్వాస విడిచింది. దీంతో గోవు సేవకులు ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు చేర వేశారు. దీంతో తుని పట్టణ మెయిన్ రోడ్డు ప్రాంతం నుంచి ప్రత్యేక ట్రాక్టర్‌పై గోవును మున్సిపల్ సిబ్బంది తరలించారు. గోవు సేవకులు పూల ఆవుకు మాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ స్మశాన వాటిక వద్ద గోవును సమాధి చేశారు.