VIDEO: యూరియా ఇవ్వాలని ధర్నా

VIDEO: యూరియా ఇవ్వాలని ధర్నా

ప్రకాశం: రైతులకు యూరియా కొరత లేకుండా సరఫరా చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. కనిగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీంద్రబాబు మాట్లాడుతూ.. తీవ్రమైన యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతుల డిమాండ్‌కు తగినంతగా ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలని కోరారు.