వలస కార్మికులకు సైబర్ నేరాలపై అవగాహన
RR: నందిగామ పరిధిలోని పెట్టి కంపెనీ కార్మికులతో ఎస్.హెచ్.ఓ పి. ప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.