కర్నూలు సభలో మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
KRNL: దేవాదాయశాఖలో ఎన్నికల హామీలను 95% అమలు చేశామని శనివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కర్నూలు దేవాదాయశాఖ పరిపాలన భవనం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. VJD తర్వాత ఇక్కడే అతిపెద్ద పరిపాలన భవనం ఏర్పాటు చేశామన్నారు. వైదిక, ఆగమ శాస్త్రం ద్వారా ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు చేసేందుకు ప్రభుత్వం GO ఇచ్చిందని, టూరిజం కోసం మంత్రుల కమిటీని వేస్తామన్నారు.