ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
MBNR: శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాజాపూర్ శ్రీ శివ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో రాజాపూర్ మండల కేంద్రంలోని పలు వీధులలో హనుమాన్ జయంతి శోభాయాత్ర కొనసాగనుట్లు ఆలయ కమిటీ పేర్కొంది.