సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సంచలనం
'SMAT-2025'లో మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అర్షద్ ఖాన్ సంచలనం సృష్టించాడు. చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 9 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి.. SMAT టోర్నీ చరిత్రలోనే అత్యత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. గతంలో 13 పరుగులకు 6 వికెట్లతో హైదరాబాద్ బౌలర్ రవితేజ, గుజరాత్ బౌలర్ అర్జాన్ నాగవాసల్లా పేరిట ఈ రికార్డ్ ఉండేది.