'ఎలాంటి ఎరువులకు కొరత లేదు'

'ఎలాంటి ఎరువులకు కొరత లేదు'

MDK: ఎలాంటి ఎరువులకు కొరతలేదని హవేలి ఘనపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి బాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు సెప్టెంబర్‌లో కొనాల్సిన ఎరువులు కూడా ఇప్పుడే కొనుగోలు చేస్తుండడంతో ఎరువుల దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతుందన్నారు. ఎరువుల కొరత ఉందనే వదంతులను రైతులు నమ్మవద్దన్నారు.