VIDEO: భూదాన్ స్ఫూర్తి పాదయాత్రలో ఎమ్మెల్యే కుటుంబం
BHNG: భూదాన్ ఉద్యమం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూడు రోజుల 'భూదాన స్ఫూర్తి పాదయాత్ర' ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించారు. వినోబాభావే ఆశయాలను, భూదాన ఉద్యమ గొప్పతనాన్ని నేటి తరానికి చాటిచెప్పడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.