సేవాకార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన వంశీ

సేవాకార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన వంశీ

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన పిట్టెల వంశీ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. మెట్‌పల్లిలో రాధ్య బ్లడ్ బ్యాంక్‌లో రక్తం దానం చేసి, ఎంపీడీవో మహమ్మద్ సలీంకు వాటర్ ప్యూరిఫైయర్ అందించారు. ఆయన మాట్లాడుతూ.. యువత తమ పుట్టినరోజు, పెళ్లిరోజుల సందర్భంగా విలాసాలకు బదులు ఇతరులకు సహాయం చేయాలని వంశీ సూచించారు.